Okinawa Okhi-90 | ఇండియన్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఒకినావా ఆటో టెక్.. అప్ డేటెడ్ ఈవీ స్కూటర్ ఒఖి-90 (Okhi-90) ఆవిష్కరించింది. పలు హైటెక్ ఫీచర్లతో అప్ డేట్ చేసింది. సింగిల్ చార్జింగ్ తో 160 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. దీని ధర రూ.1.86 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. వచ్చే సెప్టెంబర్ నెలలో డెలివరీలు ప్రారంభం అవుతాయి. గతేడాది తొలిసారి ఒఖి-90 స్కూటర్ ఆవిష్కరించింది. నాటి నుంచి ఇప్పటి వరకు 10 వేలకు పైగా స్కూటర్లను విక్రయించింది.
న్యూ ఒకినావా ఒఖి-90 ఈ స్కూటర్ నాలుగు రంగులు – రెడ్, బ్లూ, గ్రే, వైట్ రంగుల్లో లభిస్తుంది. న్యూ ఈ-స్కూటర్ 3.6 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది. మైక్రో చార్జర్ సాయంతో ఆరు గంటల్లో పూర్తిగా చార్జింగ్ అవుతుంది. ఈ స్కూటర్ గరిష్టంగా 80-90 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఎన్ కోడర్ బేస్డ్ ఎలక్ట్రిక్ హబ్ మోటార్‌తో రూపుదిద్దుకున్న ఈ స్కూటర్ 3.8 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.
ఒకినావా ఒఖి-90 ఈవీ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ @ ఫ్రంట్ అండ్ డ్యుయల్ స్ప్రింగ్ లోడెడ్ షాక్ అబ్జార్బర్స్ @ రేర్ లభిస్తాయి. ఎలక్ట్రానికల్లీ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (ఈ-ఏబీఎస్) తో కూడిన టూ వీల్స్‌కి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, మొబైల్ చార్జింగ్ యూఎస్బీ పోర్ట్, 16-అంగుళాల వీల్స్, 40 -లీటర్ల బూట్ స్పేస్, యాంటీ థెఫ్ట్ అలారం, జీపీఎస్ నేవిగేషన్ అండ్ బ్లూ టూత్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. రిమోటెడ్లీ కంట్రోల్ రియల్ టైమ్ బ్యాటరీ ఎస్వోసీ, స్పీడ్ మానిటరింగ్ యూజింగ్ యాప్ తో పని చేస్తుంది.