ఇలా చేస్తే.. నెలకు రూ.210తో రూ. 5వేల పెన్షన్ పొందొచ్చు
- ఏపీవైలో టీనేజర్లకున్న ఆఫర్
చిన్న వయస్సు నుంచే రిటైర్మెంట్ ఫండ్‌పై దృష్టి పెట్టాలనుకునేవారికి అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) అందుబాటులో ఉన్నది. ముఖ్యంగా టీనేజర్లు ఈ పథకంలో చేరితే మిగతా వయస్కులకన్నా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. వయస్సు పెరిగేకొద్దీ ప్రీమియం పెరిగే ఈ పథకానికి 18-40 ఏండ్లవారు అర్హులు. 18 ఏండ్లవారు ఈ పథకంలో చేరితే 42 ఏండ్లపాటు ప్రీమియంలు చెల్లిస్తూ పోవాలి. అలాగే 40 ఏండ్లవారు.. మరో 20 ఏండ్లు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఖాతాదారుల వయస్సు ఏదైనా.. వారికి 60 ఏండ్లు వచ్చేదాకా ప్రీమియం చెల్లింపులు కొనసాగుతాయి.
ఏపీవై ఖాతాను తెరవడం ఎలా?
అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరాలనుకునేవారికి తప్పకుండా బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో సేవింగ్స్ ఖాతా ఉండాలి. ఖాతా ఉన్నచోట సిబ్బంది సహాయంతో ఏపీవై రిజిస్ట్రేషన్ ఫారాన్ని నింపాలి. ఆధార్ (తప్పనిసరేం కాదు), మొబైల్‌ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఇవ్వాలి. ఆ తర్వాత ఎంచుకున్న చెల్లింపుల పద్ధతిని అనుసరించి ఏపీవైకి మీ ప్రీమియం సొమ్ము ఖాతా నుంచి తీసుకోవడం జరుగుతుంది. నెల, 3 నెలలు, 6 నెలల చొప్పున ప్రీమియం చెల్లింపునకు అవకాశం ఉన్నది.
ప్రీమియంలు, పెన్షన్లు ఇలా..
18 ఏండ్లవారు 60 ఏండ్ల తర్వాత తమకు నెలనెలా వెయ్యి రూపాయల పెన్షన్ రావాలనుకుంటే.. నెలకు రూ.42 చెల్లించాలి. 3 లేదా 6 నెలలకోసారి చెల్లించేవారికైతే ఈ ప్రీమియం రూ.125, రూ.248గా ఉన్నది. ఇక నెలకు రూ.2 వేలు, రూ.3 వేలు, రూ.4 వేలు, రూ.5 వేల చొప్పున పెన్షన్ పొందాలనుకుంటే.. ఆయా ప్రీమియంలూ అంతే ప్రాతిపదికన పెరుగుతాయి. మొత్తంగా ఈ పథకంలో నెలకు కనిష్ఠంగా వెయ్యి రూపాయలు, గరిష్ఠంగా రూ.5 వేలు పెన్షన్‌గా తీసుకోవచ్చు.
- 60 ఏండ్లు పూర్తయ్యాక లబ్ధిదారులు పెన్షన్ కోసం ఏపీవై ఖాతా ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ శాఖను సంప్రదించాలి.
- 60 ఏండ్లలోపే లబ్ధిదారు చనిపోతే భర్త లేదా భార్యకు ప్రీమియంలు కొనసాగించే అవకాశం. లబ్ధిదారుడి వయస్సు ప్రకారమే చెల్లింపు కాలం ఉంటుంది. ఒకవేళ ఇష్టం లేకపోతే సెటిల్మెంట్ చేసుకోవచ్చు. పెండ్లి కానట్టయితే స్కీం కొనసాగింపునకు అవకాశం ఉండదు. నామినీగా ఉన్నవారికి నిబంధనల ప్రకారం ఏకమొత్తాల్ని చెల్లిస్తారు.
- లబ్ధిదారుడు చనిపోయినప్పుడు భర్త లేదా భార్య పథకాన్ని కొనసాగించాలనుకుంటే నామినీగా మరొకరు వస్తారు. గడువు అనంతరం పెన్షన్ పొందవచ్చు. పెన్షన్ కాలంలో వీరు మరణిస్తే నామినీలకు ఏకమొత్తాల్ని చెల్లిస్తారు.
- 60 ఏండ్ల తర్వాత లబ్ధిదారుడు చనిపోతే నామినీకి వారి కోరిక మేరకు పెన్షన్ లేదా సెటిల్మెంట్ చేస్తారు.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

