న్యూఢిల్లీ, అక్టోబర్ 23: మొబైల్ యాప్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ మోబిక్విక్. పొదుపు చేయడాన్ని మరింత సరళతరం చేయాలనే ఉద్దేశంతో మొబీక్విక్ ప్రారంభించిన ఈ ప్రత్యేక డిపాజిట్ స్కీంలో రూ.1,000 నుంచి ఎంతైన డిపాజిట్ చేయవచ్చును. ఎలాంటి బ్యాంక్ ఖాతా లేకుండానే డిపాజిట్లపై వార్షిక వడ్డీని 9.5 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నది. ఏడు రోజుల నుంచి 60 నెలల కాలపరిమితిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
హైదరాబాద్, అక్టోబర్ 23: ఎన్ఎండీసీ మరోసారి తన ఖనిజ ధరలను పెంచింది. బుధవారం నుంచి అమలులోకి వచ్చేలా టన్ను లంప్సం ధరను రూ.600 పెంచడంతో రూ.6,350కి చేరుకోగా, నాణ్యమైన ఖనిజ రకం కూడా రూ.400 సవరించడంతో రూ.5,410కి చేరుకున్నది.