బోర్డు మీటింగ్ రికార్డులివ్వండి
టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానాన్ని సోమవారం టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా సవాల్ చేశారు. వచ్చే ఏడాది చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం ముగుస్తున్న క్రమంలో 3వసారీ ఆయనే కొనసాగాలని గత నెల టాటా సన్స్ బోర్డు సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా టాటా సన్స్ కంపెనీ కార్యదర్శి సుప్రకాశ్ ముఖోపాధ్యాయ్‌కి నోయెల్ టాటా లేఖ రాశారు.
- చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానాన్ని సవాల్ చేసిన నోయెల్ టాటా
ముంబై, అక్టోబర్ 26: టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానాన్ని సోమవారం టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా సవాల్ చేశారు. వచ్చే ఏడాది చంద్రశేఖరన్ ప్రస్తుత పదవీకాలం ముగుస్తున్న క్రమంలో 3వసారీ ఆయనే కొనసాగాలని గత నెల టాటా సన్స్ బోర్డు సమావేశంలో తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా టాటా సన్స్ కంపెనీ కార్యదర్శి సుప్రకాశ్ ముఖోపాధ్యాయ్‌కి నోయెల్ టాటా లేఖ రాశారు. అందులో సమావేశం అజెండాలో చంద్రశేఖరన్ పునర్నియామక అంశమే లేదని ఆయన గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఆ రోజు జరిగిన మీటింగ్ రికార్డులను ఇవ్వాలని కోరారు. అలాగే టీవీఎస్ గ్రూప్‌తో చంద్రశేఖరన్ కుటుంబ వ్యాపార సంబంధాలనూ ప్రశ్నించారు. టీవీఎస్ గ్రూప్ చీఫ్ వేణు శ్రీనివాసన్ టాటా సన్స్ బోర్డులో టాటా ట్రస్ట్స్ నామినీగా ఉన్న సంగతి విదితమే. మొత్తానికి ఈ లేఖతో టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

