హైదరాబాద్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ): ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన జాతీయ ఖనిజాభివృద్ధి(ఎన్డీఎంసీ)కి మరో అవార్డు లభించింది. క్వాలిటీ సర్కిల్స్ ఫోరం ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్‌కు సంబంధించిన క్వాలిటీ కాన్సెప్ట్స్-2023 ఏడాదికిగాను జరిగిన 37వ వార్షిక సదస్సులో నాణ్యతా ప్రమాణాల్లో అత్యుత్తమ ప్రదర్శనకుగాను సంస్థకు బెస్ట్ ఆర్గనైజేషన్ అవార్డు వరించింది.
ఈ అవార్డును రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ చేతుల మీదుగా కంపెనీ ఈడీ(రిసోర్స్ ప్లానింగ్, ఎన్విరాన్మెంట్) ఎం జయపాల్ రెడ్డి, జీఎం(హెచ్ఆర్డీ) వీ శ్రీనివాస్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి డీఆర్డీవో మాజీ చైర్మన్ జీ సతీశ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.