హైదరాబాద్, డిసెంబర్ 2: ఎన్ఎండీసీ రికార్డు స్థాయి లో ఉత్పత్తి చేసింది. గత నెలకుగాను 3.61 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. అలాగే 3.04 మిలియన్ టన్నుల విక్రయాలు జరిపింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో ఉత్పత్తి చేసిన దాంతో పోలిస్తే 8 శాతం అధికమవగా, విక్రయాల్లో 5.5 శాతం అధికమయ్యాయి. గత మూడు నెలలుగా ఉత్పత్తి అంతకంతకు పెరుగుతున్నదని, కంపెనీ చరిత్రలో ఇంతటి స్థాయిలో ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారని ఎన్ఎండీ సీఎండీ సౌమిత్ దేబ్ తెలిపారు.