హైదరాబాద్, సెప్టెంబర్ 30: ఖనిజ తయారీలో అగ్రగామి సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,720 కోట్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటంచింది. దీంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 47 మిలియన్ టన్నులకు చేరుకోనున్నదని కంపెనీ సీఎండీ సుమిత్ తెలిపారు. గురువారం కంపెనీ 63వ వార్షిక సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఖనిజం, స్టీల్ రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, అలాగే డిజిటలైజేషన్, ఆటోమేషన్, మౌలిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.