హైదరాబాద్, డిసెంబర్ 13: వందేండ్లకు పైగా చరిత్ర కలిగిన జపాన్‌కు చెంది న ఇంజినీరింగ్ కంపెనీ నికోమాక్ తైకిషా లిమిటెడ్.. తెలంగాణలో మరో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. తయారీ, నిర్మాణ రంగానికి చెందిన క్లీన్‌రూం ఉత్పత్తులను తయారు చేస్తున్న సంస్థకు ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు యూనిట్లను నిర్వహిస్తున్నది. క్లీన్రూమ్స్ ఉత్పత్తుల విభాగాన్ని బలోపేతం చేయడంతోపాటు హెచ్‌వీఏసీ సిస్టమ్స్‌ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఈ మూడో యూనిట్‌ను నెలకొల్పింది జపాన్ సంస్థ.
ప్రధాన కార్యాలయం : హైదరాబాద్
ఇండస్ట్రీ : ఇంజినీరింగ్ డివిజన్
మాతృ సంస్థ : తైకిషా(జపాన్‌లో 1913లో ప్రారంభం)