Swift Mokka Cafe | భారత్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తాజాగా స్విఫ్ట్ మొక్కా కేఫ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటర్ షో (బీఐఎంఎస్)లో ఈ కారును ఆవిష్కరించింది. పూర్తిగా స్పోర్టీ లుక్‌తో వస్తున్న న్యూ సుజుకి స్విఫ్ట్ కారు లిమిటెడ్ ఎడిషన్‌గా మాత్రమే అందుబాటులోకి తెస్తున్నది. భారత్‌లో ఇప్పటివరకు అప్డేట్ చేసిన స్విఫ్ట్ వేరియంట్ కారు రూ.5.99 లక్షలకు లభించింది. కానీ, థాయిలాండ్‌లోని సుజుకి కంపెనీ తయారు చేసిన స్విఫ్ట్ మొక్కా కేఫ్ ఎడిషన్ లాంచింగ్ ధర 6.37 లక్షల థాయ్ వాట్స్.. మన కరెన్సీలో రూ.15.36 లక్షలు పలుకుతుందని తెలుస్తున్నది.
డ్యుయల్ టోన్ కలర్స్‌లో స్విఫ్ట్ మొక్కా ఎడిషన్ వస్తుంది. పాస్టెల్ బ్రౌన్ రంగులో లోయర్ బాడీ, డాష్‌బోర్డ్, డోర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓఆర్వీఎంలు, రూఫ్‌పై లేత గోధుమ రంగు కలిగి ఉంటుందీ కారు.
అంతే కాదు స్విఫ్ట్ మొక్కా కేఫ్ ఎడిషన్ కారు పూర్తిగా ఎకో-ఫ్రెండ్లీ కారు. కే12 ఎం సామర్థ్యం గల ఇంజిన్ 108 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 1.5 లీటర్ల ఈ-20 ప్యూయల్ ట్యాంక్, అగ్రెస్సివ్ ఫ్రంట్ లిప్ స్పాయిలర్, ఫాగ్ లైట్స్ అండ్ బాడీ క్లాడింగ్‌పై ఎల్ఈడీ డీఆర్ఎల్స్ వస్తాయి. 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో కారు మార్కెట్లోకి వస్తుంది. 10-అంగుళాల టచ్‌స్క్రీన్ యూనిట్‌తో కూడిన ఇన్పోటైన్మెంట్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు జత చేశారు.
భారత్ మార్కెట్లో స్విఫ్ట్ వేరియంట్ కారు చాలా పాపులర్. దీని ధర రూ.5.99 లక్షల నుంచి రూ.8.96 లక్షల వరకు పలుకుతుంది. మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ ధర తక్కువ కాగా, భారత్ మార్కెట్లో 11 వేరియంట్ల స్విఫ్ట్ మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి.