న్యూఢిల్లీ : టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్‌స్క్వాడ్ ఎడిషన్ కింద స్పైడర్‌మ్యాన్, థార్ ఇన్స్పైర్డ్ వేరియంట్ స్కూటర్లను టీవీఎస్ లాంఛ్ చేసింది. ఐరన్ మ్యాన్, బ్లాక్ పాంధర్, కెప్టెన్ అమెరికా వేరియంట్లలో సూపర్‌స్క్వాడ్ ఎడిషన్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. ఈ శ్రేణిలో ఇతర మోడల్స్ ధరకు అనుగుణంగా రూ 84,850కు రెండు న్యూ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సూపర్‌స్క్వాడ్ ఎడిషన్ మోడల్స్ అందుబాటులో ఉంటాయని కంపెనీ వెల్లడించింది.
మార్వెల్ సూపర్ హీరోలు స్పైడర్‌మ్యాన్, థార్ ఇన్స్పిరేషన్తో రెండు న్యూ స్కూటర్లను లాంఛ్ చేయడం థ్రిల్లింగ్‌గా ఉందని కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) అనిరుద్ధ హల్దర్ పేర్కొన్నారు. నేటి యువత అభిరుచులకు అనుగుణంగా రూపొందిన ఈ రెండు కొత్త స్కూటర్లు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఫ్రాంచైజీని కస్టమర్లకు మరింత దగ్గర చేస్తాయని భావిస్తున్నామని అన్నారు.
ఇద్దరు సూపర్ హీరోల నుంచి ఇన్స్పిరేషన్తో న్యూ స్కూటర్ల డిజైన్, స్టైలింగ్‌లో కొన్ని మార్పులు చేపట్టారు. ఈ స్కూటర్లు స్టాండర్డ్ ఎన్‌టార్క్ 125 మెకానికల్ సెటప్‌కు అనుగుణంగా ఉన్నాయి. 124.8
సీసీ ఇంజన్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు.