న్యూఢిల్లీ : టీవీఎస్ మోటార్ కంపెనీ భారత్‌లో న్యూ టీవీఎస్ జూపిటర్ 125సీసీ స్కూటర్‌ను రూ 73,400 ప్రారంభ ధరతో లాంఛ్ చేసింది. హోండా యాక్టివా 125సీసీ, సుజుకి యాక్సెస్ 125కి పోటీగా నిలవనున్న జూపిటర్ 125సీసీ న్యూ స్టైలింగ్, న్యూ ప్లాట్‌ఫాం, సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్స్, మెరుగైన రైడ్ క్వాలిటీతో కస్టమర్లను ఆకట్టుకుంటుందని టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్, సీఈఓ కేఎన్ రాధాకృష్ణన్ పేర్కొన్నారు.
మారుతున్న కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా టీవీఎస్ జూపిటర్ 125 ముందుకొచ్చిందని తెలిపారు. ఈ స్కూటర్ ప్రోగ్రెసివ్ నియో-మాస్క్యలైన్ స్టైలింగ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, సిగ్నేచర్ ఫ్రంట్ లైట్ వంటి పీచర్లతో ముందుకొచ్చింది. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ స్కూటర్ స్టన్నింగ్ లుక్‌ను తీసుకువచ్చాయి. న్యూ టీవీఎస్ జూపిటర్ 125 డ్రమ్, డ్రమ్ అలాయ్, డిస్క్ వేరియంట్లతో డాన్ ఆరెంజ్, ఇండిబ్లూ, ప్రిస్టిన్ వైట్, టైటానియం, గ్రే కలర్ స్కీమ్స్‌తో అందుబాటులో ఉంది.