ఇటీవల మిడ్‌క్యాప్ షేర్లలో వాల్యూయేషన్స్ ఆకర్షణీయంగా మారాయి. ఈ అవకాశాలను వినియోగించుకునేందుకుగాను యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లో నిఫ్టీ మిడ్‌క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫండ్ ద్వారా సమీకరించిన నిధులను నిఫ్టీ మిడ్‌క్యాప్ 50లోని షేర్లలో మదుపు చేస్తారు. వీటిలో లిక్విడిటీ కూడా అధికం.
మార్కెట్ పరిస్థితులనుబట్టి ఈ ఇండెక్స్‌లో అవకాశాలు లేకపోతే.. నిఫ్టీ మిడ్‌క్యాప్ 30లోని షేర్లలో కూడా మదుపు చేస్తారు. ఇందులోని షేర్లు డెరివేటివ్ సెగ్మంట్లో కూడా ట్రేడ్ అవుతాయి. మిడ్‌క్యాప్ షేర్లలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ ఫండ్ ఓ మంచి అవకాశం. దీర్ఘకాలంలో ఆశించిన రాబడితోపాటు, ఇండెక్స్ కన్నా అధిక రాబడులను పొందే వీలుంటుంది. అలాగే వీటిలో రిస్క్ రివార్డ్ నిష్పత్తి కూడా ఆకర్షణీయం. ఈ ఫండ్‌ను జినేశ్ షా గోపని నిర్వహిస్తారు. ఈ నెల 21 వరకు ఈ ఫండ్ ఎన్ఎఫ్వోలో మదుపు చేయవచ్చు. కనీస పెట్టుబడి రూ.5,000. ఆపై ఎంతైనా చేసుకోవచ్చు. అలాట్మెంట్ అయిన తర్వాత ఏడు రోజులకు ఈ ఫండ్‌ను అమ్మితే ఒక శాతం ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. వారం రోజుల తర్వాత ఎప్పుడు అమ్మినా ఎగ్జిట్ లోడ్ ఉండదు.