Swift | న్యూఢిల్లీ, మే 20: నాలుగో జనరేషన్గా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన స్విఫ్ట్ లో సీఎన్జీ మాడల్ కూడా త్వరలో అందుబాటులోకి రాబోతున్నది. ఆ దిశగా చర్యలు ప్రారంభించిన సంస్థ.. వచ్చే కొన్ని నెలల్లో ఈ మాడల్‌ను మార్కెట్లో విడుదల చేయబోతున్నది.
1.2 లీటర్ మూడు సిలిండర్ జెడ్-సిరీస్ ఎన్ఏ పెట్రోల్ ఇంజిన్‌తో తయారైన ఈ నాలుగో తరం స్విఫ్ట్ మాడల్ ప్రారంభ ధర రూ.6.49 లక్షలుగా నిర్ణయించింది. సీఎన్జీ వెర్షన్ ధర మాత్రం రూ.90 వేలు అధికంగా ఉండనున్నదని అంచనా. పెట్రోల్ వెర్షన్ 25 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, సీఎన్జీ వెర్షన్ 32 కిలోమీటర్లు ఇవ్వనున్నది.