New Hyundai i20 | దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్న ‘న్యూ హ్యుండాయ్ ఐ20’ స్పోర్టీ లుక్‌తో వస్తోంది. హ్యుండాయ్ వెర్నా మాదిరిగా న్యూ హ్యుండాయ్ ఐ20 మోడల్ కారు రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్లె కలిగి ఉంటుంది. రివైజ్డ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్స్, 3డీ బ్రాండ్ లోగో, కాంట్రాస్ట్ కలర్డ్ ఫ్రంట్ స్ప్లిట్టర్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
న్యూ హ్యుండాయ్ ఐ20 కారు డ్యుయల్ టోన్ అల్లాయ్ వీలర్స్, రేర్ డిఫ్యూజర్, రేర్ బంపర్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు జత చేశారు. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్‌తో న్యూ హ్యుండాయ్ ఐ20 కారు వస్తోంది. కారు లోపల స్పోర్టీ లుక్ సీట్స్, ఐ20 బ్యాడ్జింగ్ ఉంటాయి.
అడాస్ షూట్ సేఫ్టీ ఫీచర్లు, లార్జ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా జత చేశారు. ఐ20 ఫేస్ లిఫ్ట్ కారు 1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 1.0 లీటర్ల టర్బో పెట్రోల్ మోటార్ ఆఫర్ కూడా ఉంటుంది. స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, సీవీటీ, డీసీటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.