Royal Enfield Bullet 350 | పాత కాలం నాటి మోటారు సైకిళ్ల తయారీ సంస్థ.. కుర్రాళ్లలో క్రేజ్ పెంచే రాయల్ ఎన్ఫీల్డ్ .. భారత్ మార్కెట్లోకి న్యూ జనరేషన్ బుల్లెట్ -350 బైక్ (New-Gen Royal Enfield Bullet 350) ఆవిష్కరించింది. మూడు కలర్ ఆప్షన్లు – మిలిటరీ రెడ్ అండ్ బ్లాక్, స్టాండర్డ్ మరూన్ అండ్ బ్లాక్, బ్లాక్ గోల్డ్ రంగుల్లో లభిస్తుంది. ప్రీ-బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. ఆదివారం (సెప్టెంబర్ 3) నుంచి డెలివరీ ప్రారంభిస్తారు. మిలిటరీ వేరియంట్ బుల్లెట్-350 బైక్ రూ.1.73 లక్షలు పలుకుతుంది. స్టాండర్డ్ వర్షన్ రూ.1.97 లక్షలు.. టాప్ హై ఎండ్ బ్లాక్ గోల్డ్ వేరియంట్ రూ.2.16 లక్షల (ఎక్స్ షోరూమ్ ధర) కు అందుబాటులో ఉన్నాయి.
న్యూ జనరేషన్ 2023 బ్లులెట్-350 బైక్ చూడటానికి పాత యూసీఈ వర్షన్ మాదిరే కనిపిస్తున్నా.. కొన్ని గణనీయ అప్ డేట్స్ తెచ్చింది. జే-సిరీస్ ఇంజిన్‌తో వచ్చిన క్లాసిక్ -350, హంటర్ -350, మీటర్-350 మాదిరిగా బుల్లెట్-350 బైక్ ఉంటుంది. న్యూ జనరేషన్ 2023 బుల్లెట్ -350 బైక్ 349 సీసీ, ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 29బీహెచ్పీ విద్యుత్, 27ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో పని చేస్తుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ న్యూ జనరేషన్ బుల్లెట్-350 బైక్‌లో అధునాతన హెడ్ లైట్, టెయిల్ లైట్ రూపొందించారు. హ్యాండిల్ బార్లో ఎల్సీడీ స్క్రీన్‌తో కూడిన డిజిటల్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చేర్చారు. దీనివల్ల బైక్ సర్వీస్ అలర్ట్, ఫ్యూయల్ రీడింగ్, ఓడో మీటర్ రీడింగ్, ఎకో ఇండికేటర్ తెలుస్తుంది. ఎంట్రీ లెవెల్ వేరియంట్ బైక్‌లో సింగిల్ చానెల్ ఏబీఎస్, బ్యాక్ డ్రమ్ బ్రేక్ ఇచ్చారు. స్టాండర్డ్, టాప్ హై ఎండ్ వర్షన్లలో డ్యూయల్ చానెల్ ఏబీఎస్ తోపాటు డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉంటుంది.