Bajaj Chetak | ఒకనాడు స్కూటర్లకు పెట్టింది పేరు బజాజ్ ఆటో. చేతక్ స్కూటర్ అత్యంత పాపులర్. ఎలక్ట్రిక్ వెహికల్స్ విభాగంలోకి ఎంటరైంది బజాజ్ ఆటో. తాజాగా న్యూ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్(Bajaj Chetak Electric Scooter) ను ఈ నెల 20న ఆవిష్కరించనున్నది. తొలుత 2020 జనవరి 14న తొలి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి తెచ్చింది. దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్కూటర్లలో బజాజ్ చేతక్ ఒకటి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) డేటా ప్రకారం మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ మూడు లక్షల పై చిలుకు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్ముడయ్యాయి.
టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1, ఎథేర్ రిట్జా తదితర ఈవీ స్కూటర్లతో బజాజ్ చేతక్ ఈవీ స్కూటర్ పోటీ పడుతున్నది. తాజాగా మార్కెట్లోకి వస్తున్న న్యూ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫ్లోర్ బోర్డుపై బ్యాటరీ ప్యాక్‌తో కూడిన ఫ్రెష్ చేసిస్ వస్తుంది. బిగ్గర్ బూట్ స్పేస్ వచ్చేలా డిజైన్ చేస్తోంది. ప్రస్తుతం 2.88 కిలోవాట్లు, 3.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌లతో మార్కెట్లో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అప్ డేటెడ్ వర్షన్లో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఒక్కసారి బ్యాటరీ చార్జింగ్ చేస్తే గరిష్టంగా 123 కి.మీ నుంచి 137 కి.మీ దూరం ప్రయానిస్తుంది. దీని ధర రూ.95,997 నుంచి రూ.1,28,744 (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతున్నది. కొత్త మోడల్ ధర పెరిగే అవకాశం ఉంది.