హైదరాబాద్, నవంబర్ 29 : రాష్ర్టానికి చెందిన ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ లిమిటెడ్‌కి మరో అతిపెద్ద ఆర్డర్‌ను చేజిక్కించుకున్నది. కెన్-బెట్వా లింక్ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న రూ.3,389.49 కోట్ల విలువైన దౌధన్ డ్యామ్ ఆర్డర్ లభించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ భారీ ఆర్డర్‌కు సంబంధించి నిర్వహించిన బిడ్డింగ్‌లో సంస్థ తక్కువ కోడ్ చేసి దక్కించుకున్నదని వెల్లడించింది. ఈ ఉత్తర్వులను వచ్చే 72 నెలల్లో(ఆరేండ్లలో) అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ఈ ప్రాజెక్టునకు సంబంధించి ప్లానింగ్, డిజైనింగ్, ఇంజినీరింగ్, హైడ్రో-మెకానికల్ పనులు ఈపీసీ(ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్సట్రక్షన్) నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది.