న్యూఢిల్లీ, ఆగస్టు 1: ముత్తూట్ ఫైనాన్స్ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్ తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.2,825 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ. 1,974 కోట్ల లాభంతో పోలిస్తే 43 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.6,485 కోట్ల నుంచి రూ.8,695 కోట్లకు చేరుకున్నది.