MTNL | న్యూఢిల్లీ, మే 5 : పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ టెలికం సంస్థ ఎంటీఎన్ఎల్.. సార్వభౌమ హామీ కలిగిన రూ.6,109.6 కోట్ల బాండ్లకు సంబంధించి వడ్డీ చెల్లింపుల్లో విఫలమైంది. ఈ మేరకు ఆ సంస్థే రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొన్నది. ఎంటీఎన్ఎల్ గతంలో రూ.5,000 కోట్ల విలువైన ప్రభుత్వ హామీ, అన్సెక్యూర్డ్, రేటెడ్, లిస్టెడ్, రిడీమబుల్, నాన్-కన్వర్టబుల్, ట్యాక్సబుల్ బాండ్లను జారీ చేసింది. వీటికి సంబంధించే వడ్డీలను చెల్లించలేక చేతులెత్తేసింది.