Motorola | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా, మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్లు కొత్త కలర్ ఆప్షన్ లో తీసుకొస్తున్నది. పాంటోన్ కలర్ మొచ్చా మౌజ్ రంగులో వచ్చే ఏడాది వస్తాయని తెలిపింది. మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఫోన్ 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్టీపీఓ పోలెడ్ మెయిన్ డిస్ ప్లే, 4-అంగుళాల కవర్ స్క్రీన్, మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ 6.4 అంగుళాల ఫ్లాట్ ఎల్టీపీఓ పోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటాయి.
మొచ్చా మౌజ్ కలర్ ఆప్షన్ లో వస్తున్న మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా, మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్లు సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో మాత్రమే లభిస్తాయి. భారత్ మార్కెట్లో లభిస్తుందా? లేదా? అన్న సంగతి వెల్లడి కాలేదు. మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఫోన్ మిడ్ నైట్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, పీచ్ ఫజ్ కలర్ ఆప్షన్లు, మోటరోలా ఎడ్జ్ 50 నియో పోన్ నాటికల్ బ్లూ, పయోంకియా, లాట్టే, గ్రిసైల్లె షేడ్స్ లో ఆవిష్కరించారు.
మోటరోలా రేజర్ 50 ఆల్ట్రా ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.99,999లకు లభిస్తుంది. 6.9 అంగుళాల ఫుల్ హెచ్డీ+ మెయిన్ స్క్రీన్, 4 అంగుళాల ఔటర్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ ఎస్వోసీ, 45 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 4000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. డ్యుయల్ 50-మెగా పిక్సెల్ రేర్ కెమెరాలు, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి.