మోటోరోలా జీ సిరీస్ నుంచి రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు రాబోతున్నాయి. మోటో జి 60, మోటో జి 40 ఫ్యూజన్ పేర్లతో వీటిని భారత మార్కెట్ లోకి తీసుకురాబోతున్నారు. ఈ రెండు మోడళ్లలో అద్భుతమైన ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
మిడ్ రేంజ్ లో రానున్న జీ 60, జీ 40 స్మార్ట్ ఫోన్లు స్నాప్ డ్రాగన్ 732 జి చిప్సెట్ ప్రాసెసర్ తో పనిచేస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిలో 108 మెగాపిక్సెల్‌తో కూడిన ప్రైమరీ సెన్సార్ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది. 6000mAh బ్యాటరీతో, ఫాస్ట్ చార్జింగ్ తో రానుంది.
సింపుల్ గా చెప్పాలంటే రెడ్మీ నోట్ 10 ప్రో మాక్స్, రియల్మీ 8 ప్రోకి పోటీగా మోటోరోలా జీ 60, జీ 40 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్లను తీసుకురానున్నట్లు సమాచారం.