నచ్చిన పని చేస్తూ, లక్ష్యాన్ని సాధించడంలోనే విజయం ఉందని చాలామంది అంటూవుంటారు. కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అసలు ‘విజయం’ అనే కాన్సెప్ట్‌కే కొత్త అర్థం చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ ‘నచ్చిన పని చేసే అవకాశం అందరికీ దొరకదు. ఈ ప్రపంచంలో ఇష్టంలేని పనిచేస్తూ బ్రతుకుతున్నవాళ్లే ఎక్కువ. బాధ్యతలు మనిషిని కఠినంగా మారుస్తాయి. మనసు చంపుకునేలా చేస్తాయి. అలాంటి పరిస్థితుల్లోనూ ముఖంపై చెరగని చిరునవ్వుతో ఉంటారే.. వాళ్లు నిజమైన సూపర్‌హీరోస్. అలాంటి వారు పడే కష్టం. వారు చూపే అంకితభావం నా దృష్టిలో గొప్ప విజయం. కేవలం ఇష్టమైన పనులు చేస్తూ లక్ష్యాన్ని సాధించేవారే విజేతలు కాదు. ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి బాధ్యతల కోసం ముందుకు సాగే వారు కూడా విజేతలే’ అంటూ చెప్పుకొచ్చారు ప్రియాంక చోప్రా. ఇప్పుడీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.