Korean Kanakaraju | ఓటీటీలోకి ‘కొరియన్ కనకరాజు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు'.
Korean Kanakaraju | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో సెప్టెంబర్ 4, 2026 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ ఇది అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్గా నటించగా, సత్య కామెడీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. థియేటర్లలో అలరించిన ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అనంతపురం జిల్లా పెనుగొండకు చెందిన కనకరాజు (వరుణ్ తేజ్) చెక్కభజన ప్రదర్శనలు చేస్తూ సరదాగా గడిపేస్తుంటాడు. కియా ఫ్యాక్టరీలో పనిచేసే చైత్ర (రితికా నాయక్)ను ప్రేమిస్తాడు. ఇదే సమయంలో కొరియా నుంచి వచ్చిన ఓ గ్యాంగ్స్టర్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? దాని లక్ష్యం ఏమిటి? దాని నుంచి బయటపడేందుకు కనకరాజు ఎందుకు కొరియా వెళ్లాల్సి వచ్చింది? అనేదే మిగతా కథ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

