Motorola moto e13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. దేశీయ మార్కెట్లోకి చౌక ధరలో కొత్త స్మార్ట్ ఫోన్ `మోటో ఈ13 (Motorola moto e13 )` తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను రూ.6,999లకు కొనుగోలు చేయొచ్చు. 6.5-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేతో వస్తున్న ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ నెల 15 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
మోటరోలా `మోటో ఈ13 (Motorola moto e13) ` ఫోన్ రెండు వేరియంట్లలో వస్తున్నది. 64జీబీ స్టోరేజీ విత్ 2జీబీ రామ్, 64 జీబీ స్టోరేజీ విత్ 4జీబీ రామ్‌తో వస్తున్నది. 2జీబీ రామ్ వేరియంట్ ధర రూ.6,999 కాగా, 4జీబీ రామ్ వేరియంట్ ధర రూ.7,999 పలుకుతుంది. జియో యూజర్లకు రూ.700 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
6.5-అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేతోపాటు సపోర్ట్ విత్ హెచ్డీ ప్లస్ (720 × 1600 పిక్సెల్స్) రిజొల్యూషన్‌తో వస్తున్నది. సెల్ఫీ కెమెరాతోపాటు ఫ్రంట్‌లో వాటర్ డ్రాప్ డిస్ప్లే కలిగి ఉంటుంది.
13-మెగా పిక్సెల్ రేర్ కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్-ఫేసింగ్ 5-మెగా పిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఒక్టాకోర్ యూనిసోస్ టీ606 ప్రాసెసర్ జత చేశారు.
మోటో ఈ13 (moto e13) ఫోన్ మూడు రంగుల్లో లభ్యం అవుతుంది. క్రీమీ వైట్, అరోరా గ్రీన్, కాస్మిక్ బ్లాక్ రంగుల్లో పొందొచ్చు. టైప్-సీ చార్జింగ్ పోర్ట్, డ్యుయల్ సిమ్ కార్డ్ సపోర్ట్, 10వాట్ల చార్జర్, ఐపీ52 వాటర్ రీపెల్లెంట్ డిజైన్‌తోపాటు డ్యుయల్ బాండ్ వై-ఫై బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ సపోర్ట్‌తో వస్తున్నది.