Moto G32 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. దేశీయ మార్కెట్లోకి మోటో జీ32 (Moto G32) ఫోన్ రెండు రంగులు.. రోజ్ గోల్డ్, సాటిన్ మరూన్ రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ లభిస్తుంది. మోటో జీ32 (Moto G32) ఆకర్షణీయ ధర రూ.11,999లకే సొంతం చేసుకోవచ్చు. సూపర్ స్మూత్ 90 హెర్ట్జ్ ఫుల్ హెచ్డీ + 6.5 అంగుళాల డిస్ప్లేతో వస్తున్నది. ఒక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుంది.
స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మోస్తోపాటు 50-మెగా పిక్సెల్ క్వాడ్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్స్ లెన్స్ సెన్సర్ కెమెరాతోపాటు 8-మెగా పిక్సల్స్ ఆల్ట్రా వైడ్ అండ్ డెప్త్ కెమెరా విత్ 118 డిగ్రీల ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెపాసిటీ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్-12 వర్షన్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 వరకు మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది.
5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 33 వాట్ల టర్బో పవర్ చార్జర్ కలిగి ఉంటుంది. 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా అందుబాటులో ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డుతో ఒక టిగా బైట్ వరకు స్టోరేజీ సామర్థ్యం పెంచుకోవచ్చు. తద్వారా స్టోరేజీ పరిమితులతో సంబంధం లేకుండా ఫొటోలు, గేమ్స్, సినిమాలు, యాప్స్, సాంగ్స్‌కు సరిపడా స్పేస్ ఉంటుంది.
యాక్సిడెంటల్ స్పిల్స్, స్ప్లాష్‌ల నుంచి రక్షణ లభిస్తుంది. అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింటర్ రీడర్తోపాటు స్టేబుల్ నెట్వర్క్ కనెక్షన్ కోసం 2×2 మిమో ఫీచర్లు ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా డాట్ ఇన్ వెబ్సైట్లలో మోటో జీ32 ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.