Motorola Edge 50 Pro | చైనా టెక్నాలజీ దిగ్గజం లెనోవో (Lenovo) అనుబంధ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) ఫోన్ కొత్త కలర్ ఆప్షన్లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గత ఏప్రిల్ నెలలోనే భారత్ మార్కెట్లోకి ఎంటరైన మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ బ్లాక్ బ్యూటీ, ల్యూక్స్ లావెండర్, మూన్ లైట్ పెరల్ రంగుల్లో లభిస్తుంది. తాజాగా వనీలా క్రీమ్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 1.5కే పోలెడ్ కర్వ్డ్ డిస్ ప్లే, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ తో పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 125వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్సైట్లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ సేల్స్ ప్రారంభం అయ్యాయి. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.31,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999 పలుకుతోంది.
మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెల్లో యూఐ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది. హెచ్ డీఆర్+ మద్దతుతో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.7 అంగుళాల 1.5 కే పోలెడ్ కర్వ్డ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50-ఎంపీ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్, 13 ఎంపీ ఆల్ట్రావైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా, 10-ఎంపీ టెలిఫోటో షూటర్ విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ ఓఐఎస్ సపోర్ట్‌తోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-ఎంపీ సెన్సర్ కెమెరా ఉన్నాయి. 125 వాట్ల వైర్డ్, 50వాట్ల వైర్ లెస్ టర్బో పవర్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్. 12 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ 125వాట్ల చార్జర్, 8 జీబీ ర్యామ్ వేరియంట్ ఫోన్ 68వాట్ల చార్జర్ తో వస్తున్నాయి.
Mahindra Scorpio- N | మహీంద్రా స్కార్పియో ఎన్ కారులో కొత్త ఫీచర్లు.. అవేమిటంటే..?!
Moto G85 5G | 10న భారత్ మార్కెట్లోకి మోటో జీ85 5జీ ఫోన్.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Hindenburg – SEBI | హిండెన్‌బర్గ్‌పై ‘సెబీ’ సంచలన ఆరోపణలు.. లాభాల స్వీకరణకే అలా నివేదికలు..!
CMF Phone 1 | 50-ఎంపీ కెమెరా.. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో సీఎంఎఫ్ ఫోన్1 ఆవిష్కరణ..!