Motorola Edge 50 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo) ఫోన్ ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గత నెలలోనే గ్లోబల్ మార్కెట్లోకి ఎంటరైన మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ల్వైథియా 700సీ కెమెరా సెన్సర్, 3ఎక్స్ టెలిఫోటో కెమెరా, ఎంఐఎల్ ఎస్టీడీ 810 మిలటరీ గ్రేడ్ సర్టిఫికెట్, మోటో ఏఐ (మోటరోలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) షూట్ ఉంటాయి. ఐదేండ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) అప్ గ్రేడ్ చేయనున్నది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోటో ఎడ్జ్ 50, మోటో ఎడ్జ్ 50 ఫ్యూషన్, మోటో ఎడ్జ్ 50 ఆల్ట్రా వంటి మోటరోలా ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ల జాబితాలో మోటరోలా ఎడ్జ్ 50 నియో జత కలిసింది.
మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్.. ఫెస్టివ్ సీజన్ సందర్భంగా రూ.23,999 ధరకే సోమవారం సాయంత్రం ఏడు గంటలకు ఫ్లిప్ కార్ట్ సేల్స్ ప్రారంభం అవుతాయి. అధికారిక సేల్స్ ఈ నెల 24 మధ్యాహ్నం 12 గంటలకు మోటరోలా ఇండియా వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్, ఇతర ప్రధాన రిటైల్ స్టోర్లలో మొదలవుతాయి. నాటికల్ బ్లూ, పయిన్ సియానా, లాట్టే, గ్రిసైల్లే కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు లభిస్తాయి. సెలెక్టెడ్ బ్యాంకుల కార్డులపై కొనుగోలు చేస్తే రూ.1000 డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ కింద మరో రూ.1000 ధర తగ్గింపు లభిస్తుంది. రూ.2000 క్యాష్ బ్యాక్ ఆఫర్ తోపాటు రూ.8000 విలువైన అదనపు ఆఫర్లను రిలయన్స్ జియో అందిస్తోంది.
మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 1.5కే రిజొల్యూషన్ తో 6.4 అంగుళాల 10 బిట్ ఫ్లాట్ ఎల్టీపీఓ డిస్ ప్లే కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, డోల్బీ ఆట్మోస్ తోపాటు డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎస్వోసీ ప్రాసెసర్ తో వస్తోంది. వర్చువల్ గా మరో 8 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 వర్షన్ పై పని చేస్తుందీ స్మార్ట్ఫోన్. ఐదేండ్ల పాటు సెక్యూరిటీ, ఓఎస్ అప్ డేట్స్ అందిస్తామని మోటరోలా తెలిపింది.
మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ల్వైథియా 700సీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 13 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ సెన్సర్ కెమెరా, 10-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.