Motorola Edge 50 Neo | చైనా టెక్ దిగ్గజం లెనోవో అనుబంధ మోటరోలా సంస్థ త్వరలో భారత్ మార్కెట్లోకి తన మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్‌ను ఆవిష్కరించనున్నది. గతేడాది సెప్టెంబర్ లో ఆవిష్కరించిన మోటరోలా ఎడ్జ్ 40 నియో ఫోన్ కొనసాగింపుగా మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ వస్తోంది. రెండు స్టోరేజీ వేరియంట్లు, నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
బ్లూ, గ్రే, పైన్ సియానా, మిల్క్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని భావిస్తున్నారు. 144 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో వస్తున్న ఈ ఫోన్ అక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్ తో వస్తోంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలు వీడియోకాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
Hyundai Exter CNG | సీఎన్జీ వేరియంట్లో ఎక్స్టర్ హెచ్‌వై-సీఎన్జీ.. రూ.8.5 లక్షల నుంచి షురూ..!
MG Motor CUV EV | టాటా కర్వ్.ఈవీకి పోటీగా ఎంజీ సీయూవీ ఈవీ.. లాంచింగ్ ఎప్పుడంటే..?!
Realme GT 6T | కొత్త కలర్ ఆప్షన్ లో రియల్ మీ జీటీ 6టీ.. 20 నుంచి సేల్స్ షురూ..!
iQoo Z9 Lite 5G | ఐక్యూ నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ జడ్9 లైట్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Kia EV6 | 1138 ఈవీ6 కార్లను రీకాల్ చేస్తున్న కియా.. కారణమిదేనా..?!