Motorola Edge 50 Neo | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్50 నియో ఫోన్ ను ఈ నెల 16 మధ్యాహ్నం 12 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిస్కరించనున్నది. ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభిస్తారు. గ్రిసైల్లి, నాటికల్ బ్లూ, పాయిన్ చియానా కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హెలియో యూఎస్ వర్షన్ పై పని చేస్తుంది. ఓఎస్ అప్ డేట్స్, సెక్యూరిటీ అప్ డేట్స్ ఐదేండ్లు అందిస్తుంది.
మోటరోలా ఎడ్జ్ 50 నియో ఫోన్ ఎల్టీపీఓ 120 హెర్ట్జ్ అడాప్టివ్ డిస్ ప్లేతో వస్తోంది. ఎస్జీఎస్ ఐ ప్రొటెక్షన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోపాటు 3000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. ఏఐ స్టైల్ సింక్, ఏఐ మ్యాజిక్ కాన్వాస్ వంటి జనరేటివ్ మోటో ఏఐ ఫీచర్లతో వస్తోందీ ఫోన్. 50-మెగా పిక్సెల్ సోనీ ల్వైథియా 700సీ మెయిన్ సెన్సర్ కెమెరాతోపాటు 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ 30ఎక్స్ డిజిటల్ జూమ్ మద్దతుతో 10 మెగా పిక్సెల్ టెలిఫోటో షూటర్ , సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో ఈ ఫోన్ వస్తోంది. 68వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 4310 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. యూరోపియన్ మార్కెట్లో దీని ధర సుమారు 499 యూరో (రూ.46 వేలు) లు పలుకుతుంది.