Motorola Edge 40 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. భారత్ మార్కెట్లోకి ‘మోటరోలా ఎడ్జ్ 40 (Motorola Edge 40)` మంగళవారం ఆవిష్కరించారు. భారత్ మార్కెట్లో 8జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ మాత్రమే విడుదల చేశారు. మీడియా టెక్ డైమెన్సిటీ 8020 చిప్ సెట్ తో వస్తున్నది. ఈ ఫోన్ ధర రూ.29,999గా నిర్ణయించారు. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఫ్లిప్ కార్ట్ ద్వారా యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ పట్ల ఆసక్తి గల వారి కోసం ప్రీ-బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఈ నెల 30 నుంచి విక్రయాలు ప్రారంభం అవుతాయి. గత నెలలోనే యూరప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో ఈ ఫోన్ ఆవిష్కరించారు.
సెలెక్టెడ్ బ్యాంకుల క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి నెలకు రూ.5000 ఈఎంఐపై ‘నోకాస్ట్ ఈఎంఐ’ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్ గా రూ.2000 రాయితీ లభిస్తుంది.
ఎక్లిప్స్ బ్లాక్, లూనర్ బ్లూ, నెబుల్లా గ్రీన్ కలర్ ఆప్షన్లలో మోటరోలా ఎడ్జ్ 40 లభిస్తుంది. గ్రీన్, బ్లాక్ వేరియంట్ ఫోన్లు విత్ వెగాన్ లెదర్ బ్యాక్ ఫినిష్, బ్లూ వేరియంట్ మ్యాట్లె అక్రియిలిక్ రేర్ పానెల్ తో వస్తున్నది.
6.55-అంగుళాల ఫుల్ హెచ్డీ + (2400 x 1080 పిక్సెల్స్) పోలెడ్ డిస్ ప్లే ప్యానెల్ విత్ రీఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్‌తో కర్వ్డ్ 3డీ గ్లాస్, శాండ్ బ్లాస్టెడ్ అల్యూమినియం బెజెల్స్ ప్రేమ్‌తో డిస్ ప్లే రూపొందించారు.
ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ఎస్వోసీ 5జీ చిప్ విత్ ఎల్పీడీడీఆర్4ఎక్స్ రామ్, 256 జీబీ యూఎస్ఎఫ్ 3.1 ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఔట్ ఆఫ్ బాక్స్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఫోన్ పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్, మూడేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది మోటరోలా.
డ్యయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నది మోటరోలా ఎడ్జ్40 ఫోన్. ఇది 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్, 13-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్ ఫర్ మాక్రో లెన్స్ కెమెరా ఉంటుంది. బ్యాక్ ప్యానెల్ మీద టాప్ లెప్ట్ కార్నర్లో టూ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్లతో స్క్వేర్ కెమెరా మాడ్యూల్ ఉంటుంది. సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
మోటరోలా ఎడ్జ్ 40 ఫోన్ 4400 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 68 వాట్ల టర్బో పవర్ వైర్డ్ చార్జింగ్, 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. వైఫై6, బ్లూ టూత్ వీ 5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ ఉంటుంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ సెన్సర్ ఫీచర్ కూడా ఉంటాయి.