Motorola Edge+ | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా.. ఎడ్జ్ + (Edge+2023) మార్కెట్లో ఆవిష్కరించింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ చిప్ సెట్, 8జీబీ రామ్ విత్ 512 ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తున్నది. 165 హెర్ట్జ్ పొలెటెడ్ డిస్ ప్లే విత్ డోల్బీ విజన్ సపోర్ట్‌తో వస్తున్నది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో అందుబాటులో ఉంటుంది. 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 68 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ అండ్ 15 వాట్ల వైర్ లెస్ చార్జింగ్ తో వస్తున్నది.
మోటరోలా ఎడ్జ్+ 2023 ఫోన్ 8జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ అమెరికాలో దాదాపు రూ.48,500 (799.99 డాలర్లు) పలుకుతుంది. ఇంటర్ స్టెల్లార్ బ్లాక్ షేడ్‌తో వస్తుంది. కెనడాలో దాదాపు రూ.78 వేలు (1299.99 కెనడా డాలర్లు) పలుకుతుంది. ఈ నెల 25 నుంచి రెండు దేశాల మార్కెట్లో లభ్యం అవుతుంది. ఈ నెల 19 నుంచి మోటరోలా డాట్ కాం, అమెజాన్, బెస్ట్ బే తదితర రిటైల్ పార్టనర్స్ వద్ద ఫ్రీ-బుకింగ్స్ ప్రారంభం అవుతాయి.
మోటరోలా ఎడ్జ్+ 2023 భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి తెలియ రాలేదు. గత నెలలోనే యూరప్ దేశాల్లో ఈ ఫోన్ ఆవిష్కరించారు. 12 జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లో యూరప్ మార్కెట్లో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.80,500 (899.99 యూరోలు) పలుకుతుంది.
6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1,080×2,400 పిక్సెల్ రిజొల్యూషన్) పోలెడ్ డిస్ ప్లే విత్ 20:9 యాస్పెక్ట్ నిష్పత్తితోపాటు 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, 165 హెర్జ్ట్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. డోల్బీ విజన్, హెచ్డీఆర్ 10+ సపోర్ట్, 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, యాంటీ ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 వర్షన్ ఓఎస్‌తో పని చేస్తుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్/ఏసీ/ఏఎక్స్/కే/వీ/ఆర్, బ్లూ టూత్ 5.3, జీపీఎస్ /ఏ-జీపీఎస్, ఎల్టీఈపీపీ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలో మీటర్, యాంబియెంట్ లైట్ సెన్సర్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఎస్ఏఆర్ సెన్సార్, బారో మీటర్, ప్రాగ్జిమిటీ సెన్సర్, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తదితర ఫీచర్లు ఉన్నాయి.