Moto G54 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా గతేడాది సెప్టెంబర్‌లో భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన మోటో జీ54 5జీ ఫోన్‌పై భారీగా ధర తగ్గించింది. ఆవిష్కరణ ధర రూ.15,999 కాగా, తాజాగా రూ.3,000 డిస్కౌంట్ ప్రకటించింది. మోటో జీ54 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.5-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా మార్కెట్లో అందుబాటులో ఉంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
గత సెప్టెంబర్‌లో ఆవిష్కరించినప్పుడు మోటో జీ54 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999, 12జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.18,999 ప్రకటించింది. తాజా డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ వేరియంట్ ధర రూ.12,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999లకు లభిస్తుంది.
మోటో జీ54 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ -13 విత్ మై యూఎక్స్ 5.0 వర్షన్‌పై పని చేస్తుంది. 6.5- అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ డైనమిక్ రీఫ్రెష్ రేటు కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్ వస్తుంది. 50-మెగా పిక్సె్ల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సర్ కెమెరా వస్తుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కలిగి ఉంటుంది.
మోటో జీ54 5జీ ఫోన్లో 256 జీబీ స్టోరేజీ కెపాసిటీని మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, 33వాట్ల టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.