Moto E13 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన మోటో ఈ13 ఫోన్ మరో కలర్ ఆప్షన్ ‘స్కై బ్లూ’ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది. గత ఫిబ్రవరిలో ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ (2 జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్) ఫోన్లు రూ.6,999లకే మార్కెట్లో లాంచ్ చేసింది. అరోరా గ్రీన్, కాస్మిక్ బ్లాక్, క్రీమీ వైట్ కలర్స్‌లో ఆవిష్కరించిన మోటరోలా.. గత నెలలో మోటో ఈ13 ఫోన్.. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ గా విడుదల చేసింది.
ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ‘స్కై బ్లూ’ కలర్ ఆప్షన్లో 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా రిలీజ్ చేసింది. అక్టోబర్ 8 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే. మోటరోలా వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ తోపాటు అన్ని రిటైల్ ఔట్ లెట్లలో మోటో ఈ13 లభిస్తుందని తెలిపింది. వాస్తవంగా మోటో ఈ13 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, ఫెస్టివల్ స్పెషల్ ధరగా రూ.6,749లకే అందుబాటులోకి తెస్తున్నది. దీంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది.
మోటో ఈ13 ఫోన్ 6.5 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్, ఒక్టాకోర్ యూనిసోక్ టీ 606 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ సింగిల్ చార్జింగ్ తో 23 గంటల వీడియో ప్లే బ్యాక్ సపోర్ట్ కలిగి ఉంటుంది. 13-మెగా పిక్సెల్ మెయిన్ రేర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కెమెరా ఉంటాయి. ఆండ్రాయిడ్ 13 (గో ఎడిషన్) ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద ఈ ఫోన్ పని చేస్తుంది.