హైదరాబాద్, సెప్టెంబర్ 5: హైదరాబాదీ కన్జ్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ మివీ తాజాగా స్మార్ట్ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ నెల 24న తమ తొలిస్మార్ట్ ఫోన్ను ఆవిష్కరించబోతున్నట్టు ప్రకటించింది. దేశీయ కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన ఈ స్మార్ట్ఫోన్లో స్నాప్డ్రాగన్ 5జీ చిప్సెట్తో అత్యంత వేగవంతమైన కనెక్టివిటీ ఉంటుందని కంపె నీ కో-ఫౌండర్ విశ్వనాథ్ కందుల తెలిపారు.
ఈ స్మార్ట్ఫోన్ను తయారు చేయడానికి హైదరాబాద్లో ప్రత్యేకంగా ఆర్అండ్డీ సెంటర్ను నెలకొల్పుతున్నట్టు, ఇందుకోసం భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్కు సమీపంలో ఉన్న ప్లాంట్లో వైర్లెస్ ఇయర్ బడ్స్, నెక్బాండ్స్, హెడ్ఫోన్లు, స్పీకర్లు, సౌండ్బార్లను ఉత్పత్తి చేస్తున్నారు.