Sunil Mittal on Telecom | జియో.. ఎయిర్టెల్.. వొడాఫోన్ కలుస్తాయా.. మిట్టల్ ఏమన్నారు?!
Sunil Mittal on Telecom | టెలికం రంగం నూతన శిఖరాలకు వెళ్లాలంటే కలిసి పని చేయాలని ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు.

Sunil Mittal on Telecom | దేశీయంగా సేవలందిస్తున్న టెలికం సంస్థలు కలుస్తాయా.. ఉమ్మడి కార్యాచరణ చేపట్టబోతున్నాయా.. అవును.. భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యలు దాన్ని ధృవీకరిస్తున్నాయి. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలు ప్రకటించిన సంగతి తెలిసిందే. వందశాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది.
కలల సాకారానికి ఉమ్మడిగా పని చేయాల్సిందే
కేంద్రం సంస్కరణలు ప్రకటించిన నేపథ్యంలో టెలికం సంస్థలు కలిసి పని చేసేందుకు గల అవకాశాలపై ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్.. వొడాఫోన్ ఐడియా సీఈవో నిక్ రీడ్‌తో చర్చించినట్లు చెప్పారు. అలాగే రిలయన్స్ జియోపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతోనూ మాట్లాడానని తెలిపారు. ఇండియన్ టెలికం రంగ కలలను సాకారం చేయాలంటే ఇండస్ట్రీ ఉమ్మడిగా పని చేయాలన్నారు.
ఖర్చులు తగ్గించుకోవాలంటే..
టెలికం సేవలందించడంలో దేశీయ టెలికం సంస్థల మౌలిక వసతులను పరస్పర సహకార ధోరణితో సంస్థలు ఉపయోగించుకోవాలని సూచించారు. దీనివల్ల టెలికం సంస్థలపై ఖర్చుల భారం తగ్గుతుందన్నారు. అదే సమయంలో టెలికం సంస్థల మధ్య కార్టెలైజేషన్ ఉండబోదని సునీల్ మిట్టల్ స్పష్టం చేశారు.
చౌక స్మార్ట్‌ఫోన్ తెచ్చేందుకు ఎయిర్టెల్ రెడీ
రిలయన్స్ జియో తీసుకొస్తున్న అత్యంత చౌక స్మార్ట్ ఫోన్‌కు పోటీగా హ్యాండ్సెట్ మేకర్ల (మొబైల్ ఫోన్ల తయారీ సంస్థలు)తో ఎయిర్టెల్ ఒప్పందాలు కుదుర్చుకుంటుందని వార్తలొచ్చాయి. దీనిపై సునీల్ మిట్టల్ మాట్లాడుతూ.. ఆ అవసరం తలెత్తితే చౌక స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు ఎయిర్టెల్ సిద్ధంగా ఉందన్నారు.
సహకార ధోరణితో పోటీతత్వం
టెలికం రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్లేందుకు టెలికం సేవల ప్రొవైడర్లు చేతులు కలుపాల్సి ఉంటుందని మీడియా సమావేశంలో చెప్పారు. ఈ సహకార ధోరణి వల్ల టెలికం రంగంలో పోటీ తత్వం నెలకొంటుందన్నారు. మార్కెట్ పంపిణీపై ఆరోగ్యకరమైన చర్చలు జరిగాయని, టారిఫ్‌లపై కాదని అన్నారు. వొడాఫోన్ ఐడియా సీఈవో నిక్‌రీడ్, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీతో జరిగిన చర్చల్లో టెలికం రంగ సహకారం.. ఇతర మౌలిక వసతుల రంగాలకు రోల్‌మోడల్‌గా ఉంటుందని చెప్పానని మిట్టల్ వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
BRS | బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
Crop Losses | పంట నష్టం.. 20,000 కోట్లు..! సాగునీటి కొరత.. విద్యుత్తు కోతలతో రాష్ట్రవ్యాప్తంగా ఎండుతున్న పంటలు
BRS Legal Notice | వెలుగు పత్రికకు బీఆర్ఎస్ నోటీస్.. మాజీ సీఎం ప్రతిష్టను దెబ్బతీసే దుష్టప్రయత్నం
Horoscope | 19-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

