బీఆర్ఎస్ దెబ్బకు దిగొచ్చిన జీఆర్ఎంబీ.. ఏపీ ప్రతిపాదనలు తిరస్కరణ
బీఆర్ఎస్ దెబ్బతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) దిగొచ్చింది. తెలంగాణ ప్రాజెక్టులకు మంజూరు చేసిన అనుమతులను రద్దు చేయాలన్న ఏపీ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఆ అంశాలను ఎజెండాలో చేర్చేందుకు నిరాకరించింది. వాటి ప్రస్తావన లేకుండానే 30న బోర్డు 18వ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది.
- తెలంగాణ ప్రాజెక్టుల అనుమతుల్ని సమీక్షించేది లేదని స్పష్టీకరణ
- 30న బోర్డు18వ సమావేశం
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ దెబ్బతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) దిగొచ్చింది. తెలంగాణ ప్రాజెక్టులకు మంజూరు చేసిన అనుమతులను రద్దు చేయాలన్న ఏపీ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఆ అంశాలను ఎజెండాలో చేర్చేందుకు నిరాకరించింది. వాటి ప్రస్తావన లేకుండానే 30న బోర్డు 18వ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు జీఆర్ఎంబీ చైర్మన్ ఇరు రాష్ర్టాలకు సమాచారం అందించారు. వాస్తవానికి ఆగస్టులోనే ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించిన జీఆర్ఎంబీ.. ఎజెండా అంశాలను పంపాలని ఇరు రాష్ర్టాలకు సూచించింది. దీంతో నిబంధనలకు విరుద్ధమైన ప్రతిపాదనలు పంపిన ఏపీ.. గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు లేనేలేవని పేర్కొన్నది. రాష్ట్ర విభజన తర్వాత కాళేశ్వరం, సీతారామ, చౌటుపల్లి హనుమంత్‌రెడ్డి తదితర ప్రాజెక్టులకు మంజూరు చేసిన అనుమతులన్నింటినీ పునఃసమీక్షించాలని కోరింది. దీనిపై బోర్డు తెలంగాణ అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఆ అంశాలను ఎజెండాలో చేర్చింది. అంతేకాకుండా ఏపీ వాదనలకు అనుగుణంగా నీటి లభ్యతపై అధ్యయనం కోసం టెక్నికల్ కమిటీ ఏర్పాటు చేయాలని ఎజెండా సిద్ధం చేసింది. దీంతో ఏపీ ప్రతిపాదనలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది.
ఏపీ ప్రతిపాదించిన అంశాలను వెంటనే ఎజెండా నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిప్పులు చెరిగింది. అనంతరం కండ్లు తెరచిన రేవంత్‌రెడ్డి సర్కార్.. ఏపీ ప్రతిపాదనలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బోర్డుకు లేఖ రాసింది. ఆ అంశాలను తొలగించాలని డిమాండ్ చేసింది. ఎజెండాపై వివాదంపై చెలరేగడంతో 18వ సమావేశాన్ని వాయిదా వేసిన బోర్డు.. అదే సమావేశాన్ని ఈ నెల 30న నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇరు రాష్ర్టాలకు మరోసారి ఎజెండాను పంపిన జీఆర్ఎంబీ.. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులపై చేసిన ఏపీ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) నుంచి అనుమతులు పొందిన ప్రాజెక్టులను పునఃసమీక్షించలేమని, మళ్లీ చర్చించే అధికారం తమకు లేదని స్పష్టం చేసింది. బోర్డు నిర్వహణ నిధులు, నీటి లభ్యతను లెక్కించేందుకు టెలిమెట్రీల ఏర్పాటు, 17వ సమావేశ మినిట్స్‌ను ఆమోదించడం తదితర అంశాలకే ఎజెండాను పరిమితం చేసింది. బీఆర్ఎస్ నిలదీయడమే ఇందుకు కారణమని స్పష్టమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

