Billgates | గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకున్నది.. సంస్థ ఫౌండర్- మాజీ సీఈవో బిల్‌గేట్స్‌పై వచ్చిన లైంగిక వేధింపులపై విచారణకు అమెరికాలోని ప్రముఖ న్యాయ సంస్థ అరెంట్ ఫాక్స్ ఎల్ఎల్పీని నియమించుకున్నది. బిల్‌గేట్స్‌పై లైంగిక వేధింపుల విచారణ అర్దంతరంగా ముగిసింది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ నియమించుకున్న అరెంట్.. టెక్ దిగ్గజం బోర్డు రూపొందించిన నివేదికను సమీక్షించిన తర్వాత బయటకు వెల్లడిస్తుంది. ఒక బిల్‌గేట్స్ గురించి మాత్రమే కాదు.. 2019 తర్వాత మైక్రోసాఫ్ట్‌లో పని చేసే పలువురు సెలబ్రిటీలపై ఆరోపణలొచ్చాయి.
ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులు, లింగ వివక్ష, ఇతర సమస్యలపై కంపెనీ విధానాలను సమీక్షించాలని మైక్రోసాఫ్ట్ బోర్డును వాటాదారులు కోరారు. అందుకే అరెంట్ ఫాక్స్‌ను మైక్రోసాఫ్ట్ నియమించుకున్నది. ప్రముఖులపై వచ్చిన ఆరోపణలు నిజమా? కాదా? అనే అంశంతోపాటు భవిష్యత్‌లో ఇటువంటి పరిణామాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలన్న విషయమై ఒక పద్దతిని అనుసరించనున్నది. ఈ విషయమై ఉద్యోగుల ఆందోళనలు, పరిష్కారాలపై అరెంట్ దృష్టి సారిస్తుంది.
మరోవైపు బిల్ గేట్స్ 2020 మార్చిలో మైక్రోసాఫ్ట్ చైర్మన్‌గా వైదొలిగారు. తన గేట్స్ ఫౌండేషన్ కోసం దిగి పోయినట్లు బిల్ గేట్స్ ప్రకటించుకున్నా.. అసలు కారణం లైంగిక వేధింపులేనని ఆలస్యంగా బయటపడింది. 2007లో ఉద్యోగులను ఈ-మెయిల్స్‌తో వేధించేవాడని, ఉమనైజర్ అని, ఉద్యోగులతో ఆయన ప్రవర్తనాశైలి బాగుండేది కాదని ఆరోపణలు వచ్చాయి. ఈ అభియోగాల విషయమై మైక్రోసాఫ్ట్ బోర్డు ఆయన్ను మందలించిందని వార్తలొచ్చాయి.