హైదరాబాద్, జనవరి 7 : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ తన ఈవీ మాడల్ విండ్సార్ ధరను పెంచింది. మూడు రకాల్లో లభించనున్న ఈ మాడల్ ధరను రూ.50 వేలు పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకున్నది. దీంతో ఈ కారు ధర రూ.13.99 లక్షల నుంచి రూ.15.99 లక్షల మధ్యలోకి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.13.49 లక్షల నుంచి రూ.15.49 లక్షల మధ్యలో లభించేది.