MG Windsor EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దేశీయ మార్కెట్లోకి తన విండ్సార్ ఈవీ కారును తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. జడ్ఎస్ ఈవీ, కామెట్ ఈవీ తర్వాత జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా నుంచి మార్కెట్లోకి వచ్చిన మూడో కారు ఇది. అయితే, అన్ని వేరియంట్ల విండ్సార్ ఈవీ కార్ల ధరలను కంపెనీ ప్రకటించలేదు. ఈ నెల 25 నుంచి టెస్ట్ డ్రైవ్ ప్రారంభం కానున్నది. అక్టోబర్ మూడో తేదీ నుంచి బుకింగ్స్ మొదలవుతాయి. అక్టోబర్ 12 నుంచి కార్ల డెలివరీ ప్రారంభించనున్నది జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.
ఫస్ట్ కార్ల కొనుగోలు దారులకు విండ్సార్ ఈవీపై జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా యాజమాన్యం అపరిమిత కి.మీతో కూడిన లైఫ్ టైం వారంటీ ఆఫర్ చేస్తోంది. కొనుగోలు చేసిన మూడేండ్ల తర్వాత ఈ కారుపై 60 శాతం రీ సేల్ విలువ ఉంటుందని తెలుస్తోంది. అందుకే మూడేండ్ల పాటు సమగ్ర వారంటీ, మూడేండ్ల పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్, మూడేండ్లు నో లేబర్ చార్జీలను ఆఫర్ చేస్తున్నది.
ఎంజీ విండ్సార్ ఈవీ కారు పర్మినెంట్ మ్యాగ్నైట్ సింక్రోనియస్ మోటార్ విత్ 38కిలోవాట్ల లిథియం ఐరన్ ఫాస్పేట్ (ఎల్ఎఫ్టీ) బ్యాటరీతో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 136 పీఎస్ విద్యుత్, 200 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సింగిల్ చార్జింగ్ పూర్తయితే 331 కి.మీ దూరం ప్రయాణించగలుగుతుంది. ఎయిరోగ్లైడ్ డిజైన్ తో వస్తున్న వెరీ ఫ్యూచరిస్టిక్ ఈవీ కారు విండ్సార్ ఈవీ. ఇల్యూమినేటెడ్ ఫ్రంట్ లోగో, ఎల్ఈడీ లైట్స్ (హెడ్ అండ్ టెయిల్), ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉంటాయి.
విండ్సార్ ఈవీ కారు క్యాబిన్ లోపల ఎయిరో లాంజ్ సీట్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, ఎయిర్గైల్ ఇన్స్పైర్డ్ సీట్ అప్ హోల్స్టరీ, 15.6 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ విత్ వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ ఏ ఫిజికల్ ప్యానెల్, 9-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పీఎం 2.5 ఫిల్టర్ అండ్ పనోరమిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 135 డిగ్రీల రీసైక్లైన్ యాంగిల్ తోపాటు 60:40 స్ప్లిట్ రేర్ సీట్లు ఉంటాయి. ఎంజీ-జియో ఇన్నోవేటివక్ కనెక్టివిటీ ప్లాట్ ఫామ్ (ఎంజీ-జియో ఐసీపీ) కల తొలి జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా కారు విండ్సార్ ఈవీ.
80కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో ఐ-స్మార్ట్ కనెక్టివిటీ, వెహికల్ ఆపరేషన్స్ కోసం డిజిటల్ బ్లూటూత్ కీ, పవర్డ్ టెయిల్ గేట్, 36కిపైగా స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది విండ్సార్ ఈవీ కారు. టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 కార్ల కంటే చౌక. టాటా నెక్సాన్ ఈవీ ధర రూ.12.49 లక్షల నుంచి, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 కారు ధర రూ.15.49 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టాటా పంచ్ ఈవీ కారు ధర రూ.9.99 లక్షల నుంచి మొదలవుతుంది.