MG Hector | ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా (MG Motor India) తన ఎస్యూవీ హెక్టర్ (Hector) కారులో కొత్తగా చిరిస్టెన్డ్ షైన్ ప్రో (Christened Shine Pro), సెలెక్ట్ ప్రో (Select Pro) వేరియంట్లను ఆవిష్కరించింది. 2019 జూన్ నుంచి భారత్లో అమ్ముడవుతున్న అత్యంత పాపులర్ ఎస్యూవీ కార్లలో హెక్టర్ (Hector) ఒకటి. కొత్తగా మార్కెట్లో ఆవిష్కరించిన చిరిస్టెన్డ్ షైన్ ప్రో కారు ధర రూ.15,99,800 (ఎక్స్ షోరూమ్), సెలెక్ట్ ప్రో రూ.17,29,800 (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది.
హెక్టర్ చిరిస్టైన్డ్ షైన్ ప్రో, హెక్టర్ సెలెక్ట్ ప్రో మోడల్ కార్లలో14 – అంగుళాల పోర్ట్రైట్-ఓరియెంటెడ్ హెచ్డీ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. హెక్టర్ సెలెక్ట్ ప్రో వేరియంట్ డ్యుయల్ పేన్ పనోరమిక్ సన్ రూఫ్, షైన్ ప్రో సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ కలిగి ఉంటాయి. రెండు వేరియంట్లూ న్యూ డాష్ బోర్డ్ డిజైన్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, వైర్ లెస్ చార్జర్, 17.78 సీఎం ఎంబీడెడ్ ఎల్సీడీ డిస్ప్లేతోపాటు ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ స్టార్ట్ / స్టాప్ బటన్, ఫ్లోటింగ్ లైట్ టర్న్ ఇండికేటర్స్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ – కనెక్టెడ్ టెయిల్ లైట్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఎంజీ హెక్టర్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్ అండ్ సీవీటీ గేర్ బాక్స్ ఆప్షన్లతోపాటు 1.5 లీటర్ల టర్బో చార్జ్డ్ ఇంజిన్, 2.0-లీటర్ల టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజిన్ విత్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది.
ఎంజీ హెక్టార్ ఎస్యూవీ చిరిస్టైన్డ్ ప్రో, సెలెక్ట్ ప్రో వేరియంట్ల ఆవిష్కరణ సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ ఎండీ సౌరవ్ గుప్తా మాట్లాడుతూ ‘సుపీరియర్ డ్రైవింగ్ కంఫర్ట్ విత్ 2-అడాస్ లెవెల్, కనెక్టెడ్ ఫీచర్లతోపాటు పలు టెక్నాలజీ ఫీచర్లతో రూపుదిద్దుకున్నది. హార్మోనియనస్ బ్లెండ్ ఆఫ్ కంఫర్ట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఎర్గోనోమిక్ డిజైన్ ఫీచర్లు ఉన్నాయి. మార్కెట్ రీసెర్చ్, ఇండస్ట్రీ అనాలసిస్, కస్టమర్ల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు రెండు కొత్త వేరియంట్లు ఆవిష్కరించాం’ అని చెప్పారు.