న్యూఢిల్లీ, డిసెంబర్ 26: కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఆటోమొబైల్ సంస్థలు ఆకర్షణీయమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. పలు మాడళ్లపై రాయితీలు ప్రకటిస్తున్న సంస్థలు.. దీంట్లోభాగంగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా సరికొత్త ప్రణాళికను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కంపెనీకి చెందిన ఎంజీ ఆస్టర్, ఎంజీ హెక్టార్లను కొనుగోలు చేసిన వారికి జీరో డౌన్‌పేమెంట్‌తో 100 శాతం రుణాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. విడిభాగాలకోసం కూడా రూ.50 వేల వరకు నిధులు కూడా అం దించనున్నది. ఈ ఆఫర్ ఈ నెల చివరి వరకు మాత్రమే.