Meta : మెటా కంపెనీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. లైవ్ స్ట్రీమింగ్ యాప్ సూపర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఆపేస్తున్నట్టు మెటా వెల్లడించింది. దాంతో ఫిబ్రవరి 15 నుంచి సూపర్ యాప్ నిలిచిపోనుంది. దాంతో యూజర్లు కొత్త పోస్టులను క్రియేట్ చేయలేరు. ఇన్ఫ్లుయెన్సర్ల కోసం 2020లో ఈ లైవ్ స్ట్రీమింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. మెటా కంపెనీ ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన యాప్స్‌లో సూపర్ ఒకటి. ఈ యాప్‌ను తేవడం కోసం క్రియేటర్స్‌కు 3వేల డాలర్లు చెల్లించినట్టు వెల్లడించింది.
ఈ వారం మొదట్లో 10 ఏళ్ల నాటి కనెక్టవిటీ డివిజన్‌కు మంగళం పాడింది. అంతేకాదు రెండు రోజుల క్రితమే డెన్మార్క్‌లోని ఒడెన్సే సిటీలో రెండు కొత్త డేటా సెంటర్ల నిర్మాణాన్ని కూడా మెటా ఆపేసింది. పెర్ ఆర్స్లెఫ్ అనే సివిల్ ఇంజినీరింగ్ కంపెనీతో చేసుకున్న 344 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేసుకుంది. డేటా సెంటర్ల బదులు ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేయలనుకున్నట్టు మెటా తెలిపింది. 2023లో బుల్లెటిన్ అనే న్యూస్ లెటర్ ప్రొడక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు అక్టోబర్ నెలలో ప్రకటించింది. ఆగష్టులో క్వెస్ట్ 1 వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ తయారీని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.