Meta Layoffs | ఐటీలో కొనసాగుతున్న కొలువుల కోతలు.. మెటాలో మరోసారి లేఆఫ్స్ కలకలం
Meta Layoffs | టెక్ (tech) రంగంలో లేఆఫ్స్ (layoffs) పర్వం కొనసాగుతోంది. తాజాగా ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Meta Layoffs | టెక్ (tech) రంగంలో లేఆఫ్స్ (layoffs) పర్వం కొనసాగుతోంది. ఆర్థికమాంద్యం ప్రభావంతో ఖర్చు తగ్గింపులో భాగంగా గూగుల్ (Google) , మైక్రోసాఫ్ట్ (Microsoft), అమెజాన్ (Amazon), ట్విట్టర్ (Twitter), లింక్డిన్ (LinkedIn), మెటా (Meta) వంటి టెక్ దిగ్గజాలు (tech Companies) ఒకదాని తర్వాత ఒకటి సంస్థలోని ఉద్యోగులను ఇప్పటికే తొలగించాయి. పలు కంపెనీలు ఇంకా లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. విడతలవారీగా ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. తాజాగా ఫేస్బుక్ (Facebook) మాతృసంస్థ అయిన మెటా (Meta) మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
మెటా ఇప్పటికే పలు రంగాలకు చెందిన ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. మార్కెటింగ్, సైట్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ఇంజినీరింగ్, ప్రోగ్రాం మేనేజ్మెంట్, కంటెంట్ స్ట్రాటజీ, కార్పొరేట్ కమ్యూనికేషన్ సహా పలు విభాగాల్లోని ఉద్యోగులను తొలగించింది. తాజాగా సిలికాన్ యూనిట్ లోని (Silocon Unit) మెటావర్స్ లో ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ సిద్ధమైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే అంతర్గత చర్చల్లో ఉద్యోగులకు తొలగింపుపై సమాచారం అందించినట్లు సంస్థలోని ఇద్దరు ఉన్నతాధికారులు వెల్లడించినట్లు నివేదికలు తెలిపాయి. తొలగింపు జాబితాను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నాయి.
కంపెనీ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో భాగంగా ఉద్యోగులను తీసివేయనున్నట్లు ఈ ఏడాది మార్చిలో సీఈఓ (CEO) మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు అప్పుడు వెల్లడించారు. ఉద్యోగుల తొలగింపును ఏప్రిల్, మేలో రెండు విడతలగా చేపడతామని వెల్లడించారు. అందులోభాగంగానే ఏప్రిల్‌లో నాలుగు వేల మందిని ఇంటికి పంపిన మెటా.. మిగిలిన 6వేల మంది ఉద్యోగుల్ని మే నెల చివర్లో తొలగించింది. ఇప్పుడు తాజాగా మరోసారి ఉద్యోగుల తొలగింపుకు సిద్దం కావడం టెక్ ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది.
Also Read..
Ram Charan | ముంబై సిద్ధివినాయక ఆలయంలో చరణ్ పూజలు.. పిక్స్ వైరల్
Vande Bharat | వందేభారత్ స్లీపర్ కోచ్.. ఫొటోలు చూశారా..?
Sikkim Floods | సిక్కింని ముంచెత్తిన ఆకస్మిక వరదలు.. 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

