Meta layoffs | డెస్క్ నుంచి మీ వస్తువులు తీసుకుని వెళ్లిపోండి.. ఉద్యోగులకు మెటా మరో మెయిల్
తాజాగా తొలగించిన ఉద్యోగులకు మరోసారి కంపెనీ మెయిల్స్ పంపింది. డెస్క్ దగ్గర ఉద్యోగులకు సంబంధించిన ఏవైనా వ్యక్తిగత వస్తువులు ఉంటే తీసుకుని, ఆఫీసుల నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ తాజా మెయిల్ పంపింది.
Meta layoffs : ఫేస్బుక్ మాతృసంస్థ మెటా భారీ లేఆఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా 8,000 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సంస్థ ఉద్యోగుల్లో మొత్తం 10 శాతం సిబ్బందితో సమానం. ఈ మేరకు ఉద్యోగులకు ఇప్పటికే మెయిల్స్ పంపింది. తాజాగా తొలగించిన ఉద్యోగులకు మరోసారి కంపెనీ మెయిల్స్ పంపింది. గురువారం ఉదయం 4 గంటలకు కంపెనీ మళ్లీ మెయిల్స్ పంపింది. డెస్క్ దగ్గర ఉద్యోగులకు సంబంధించిన ఏవైనా వ్యక్తిగత వస్తువులు ఉంటే తీసుకుని, ఆఫీసుల నుంచి వెళ్లిపోవాలని సూచిస్తూ తాజా మెయిల్ పంపింది.
అంతేకాదు.. త్వరలో ఉద్యోగుల బ్యాడ్జీలు డీయాక్టివేట్ చేయనున్నట్లు, ఇంటర్నల్ సిస్టమ్స్ యాక్సెస్ చేయకుండా పూర్తిగా తొలగించనున్నట్లు వెల్లడించింది. ఉద్యోగులకు ఈ మెయిల్ అందిన గంట వ్యవధిలోనే వారందరినీ అల్యూమ్ని పోర్టల్‌లో చేర్చింది. అంటే.. సంస్థ పూర్వపు ఉద్యోగుల జాబితాలో చేర్చింది. ఇందులో లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులకు అందించనున్న ప్రయోజనాలు, బెనిఫిట్స్, వీసా సౌకర్యాల గురించిన వివరాలు అందుబాటులో ఉంటాయి. ఉద్యోగులు తమకు అందబోయే ప్రయోజనాల గురించి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం మెటా సంస్థ ఏఐ మీద ఫోకస్ చేయనుంది. 8,000 మంది ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీ.. మిగతా ఉద్యోగుల్లో 7,000 మందిని ఏఐ టెక్నాలజీ వైపు మళ్లించనుంది.
ఉద్యోగుల తొలగింపుపై మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తొలగించిన ఉద్యోగులకు జుకర్‌బర్గ్ ప్రత్యేక మెమో అందజేశాడు. కంపెనీ నిర్మాణంలో పాలుపంచుకుని, తమ లక్ష్యాలు నెరవేర్చడంలో సాయపడిన వారికి గుడ్‌బై చెప్పడం బాధగా ఉందన్నాడు. ఆ బాధను తాను అనుభవిస్తున్నట్లు చెప్పాడు. అయితే, ఈ ఏడాది మళ్లీ భారీ స్థాయిలో మిగిలిన ఉద్యోగుల్ని తొలగించబోనని ప్రకటించాడు. ఇది మిగిలిన ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించే అంశం. 2022–2023 నుంచి మెటా భారీగా ఉద్యోగుల్ని తొలగిస్తూ వస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

