Lionel Messi : సినిమా సెలబ్రిటీలు, క్రికెట్ స్టార్లు సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరలవుతుంది. అలాంటిది వారు ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారంటే అభిమానులు పోటీపడి మరీ కొనుక్కుంటారు. తాజాగా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) ఒకేఒక సరదాగా చేసిన ఓ కామెంట్ శీతల పానీయాల తయారీ కంపెనీ కోక- కోలా(Coca Cola)కు వందల కోట్ల డబ్బు తెచ్చిపెట్టింది. గత మూడు రోజులుగా స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ షేర్ దాదాపు 5 శాతం అంటే 12.9 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇంతకూ మెస్సీ ఏం అన్నాడంటే..?
ఈ మధ్యే గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా భారత పర్యటనలో అభిమానులను రంజింపజేసిన లియోనల్ మెస్సీ అమెరికా స్టాక్ మార్కెట్‌ను షేక్ చేశాడు. లుజ్ టీవీతో మాట్లాడుతూ తన డ్రింక్ కాంబినేషన్ గురించి చెప్పాడతడు. ‘నాకు వైన్ అంటే ఇష్టం. ఒకవేళ అది లేదంటే నా ఫేవరెట్ కాంబినేషన్ ఎలాగూ ఉండనే ఉంది. స్ప్రైట్‌తో కలిపి వైన్ తీసుకుంటా. ఈ కాంబినేషన్ల్ చాలా బాగుంటుంది’ అని మెస్సీ అన్నాడు. సాకర్ ఐకాన్ అలా చెప్పడమే ఆలస్యం.. అమెరికా స్టాక్ మార్కెట్లో కోక కోలా కంపెనీ షేర్లు దాదాపు 5 శాతం అంటే 12.9 బిలియన్ (భారతీయ కరెన్సీలో రూ.11,63,00,77,00,530) డాలర్లకు ఎగబాకాయి.
🚨 Lionel Messi’s mention of drinking wine with Sprite boosted Coca-Cola’s stock by 4.5%.
It generated a $12.9 billion increase in market value over the last 3/4 days (Sprite is owned by Coca-Cola).
Look at the impact Messi caused with a simple statement in an interview… 🐐🍷 pic.twitter.com/mZATrdKqRD
— Transfer News Live (@DeadlineDayLive) January 11, 2026
వైన్, స్ప్రైట్ కలిపి తాగడమేంటీ? అని ఒకింత ఆశ్చర్యం వేయకమానదు. ఇదే విషయంపై అర్జెంటీనా స్టార్ ఫన్నిగా స్పందించాడు. ‘ వైన్, స్ప్రైట్ మిక్స్ చేసుకొని తాగితే నాకు రిలాక్స్‌గా అనిపిస్తుంది. అంతేకాదు నేను ఒంటరిగా కాసేపు డిపేందుకు అవకాశం దొరకుతుంది. ఎందుకంటే.. ఇంట్లో ముగ్గురు పిల్లలు తెగ అల్లరి చేస్తారు. వారు నా శక్తినంతా తోడేస్తారు. అలాంటప్పుడు వైన్, స్ప్రైట్‌తో చిల్ అవుతా’ అని వెల్లడించాడు.
En apoyo alpueblo latinoamericano cristiano Ronaldo rechaza tomar Coca-Cola ☺️👌 pic.twitter.com/6UdTTQbO81
— Alicia Reportera del Pueblo (@Roja53C) February 2, 2025
క్రీడాకారులు సరదాగా చెప్పిన విషయాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపడం ఇదే మొదటిసారి కాదు. ఐదేళ్ల క్రితం ‘యూరో 2020’ టోర్నమెంట్ సందర్భంగా ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) ఉద్దేశపూర్వంగా కోక -కోలా కంపనీ బాటిళ్లను పక్కన పెట్టేశాడు. దాంతో.. ఆ కంపెనీ షేర్లు 4 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.