హైదరాబాద్, అక్టోబర్ 4: మెడికల్ టెక్నాలజీ కంపెనీ న్యూరో42 డైరెక్టర్ల బోర్డులో తన లీడ్ ఇన్వెస్టర్, జీవీకే గ్రూప్‌నకు చెందిన కృష్ణ భూపాల్‌ను నియమించింది.
టెక్నాలజీ ఇన్వెస్టర్, బిజినెస్ లీడర్ అయిన కృష్ణ భూపాల్ న్యూరో 42 బృందంలో చేరడంతో ఎప్పటికప్పుడు మారిపోతున్న గ్లోబల్ వాణిజ్య వాతావరణంలో తాము సజావుగా ప్రయాణించడానికి తోడ్పడుతుందని న్యూరో42 వ్యవస్థాపకుడు, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ అభిత్ బత్రా బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఎనర్జీ, తాజ్‌జీవీకే హాస్పిటాలిటీ, హెల్త్, రియల్ ఎస్టేట్ వంటి కీలక పరిశ్రమల్లో గణనీయమైన షేర్‌హోల్డర్ వాల్యూను పెంచిన ట్రాక్ రికార్డ్ కృష్ణ భూపాల్‌కు ఉందని ప్రకటన పేర్కొంది. డయోగ్నస్టిక్ ఇమేజింగ్, మెదడుకు సంబంధించిన ఇమేజ్-గైడెడ్ సర్జికల్ ఇంటర్వెన్షన్స్ తదితరాల్లో న్యూరో42 కార్యకలాపాలు నిర్వహిస్తున్నది.