McLaren Artura | బ్రిటన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మైక్ లారెన్ ఆటోమోటివ్ (McLaren Automotive ) భారత్ మార్కెట్లోకి మరో కొత్త హైబ్రీడ్ సూపర్ కారు ఆర్టురా (Artura) శుక్రవారం ఆవిష్కరించింది. ఈ సూపర్ కారు ధర రూ.5.1 కోట్లు అని తెలిపింది. మైక్ లారెన్ అర్టురా కారు ఇంజిన్ 2933 సీసీ, మూడు లీటర్ల సామర్థ్యం గల ట్విన్ టర్బో వీ6 ఇంజిన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. ఇది 680 బీహెచ్పీ విద్యుత్, గరిష్టంగా 720 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది.
మైక్ లారెన్ కార్బన్ లైట్ వెయిట్ ఆర్కిటెక్చర్ (ఎంసీఎల్ఏ)తో డిజైన్ చేసింది. ఈ కారు కేవలం మూడు సెకన్లలో 100కి.మీ స్పీడ్, 8.3 సెకన్లలో 200 కి.మీ. వేగం అందుకుంటుంది. ఈ కారులో ఎలక్ట్రిక్ మోటార్, 7.4కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటది. దీని సాయంతో 31 కి.మీ దూరం ప్రయాణం చేయవచ్చు.
మైక్ లారెన్స్ ఆర్టురా కారు 8 -అంగుళాల ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ తో వస్తున్నది. ఇది ఆపిల్ కారు ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకు సపోర్ట్‌గా ఉండటంతోపాటు అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ-మోడ్, కంఫర్ట్, స్పోర్ట్, ట్రాక్ అనే నాలుగు మోడ్స్‌లో ఈ కారు లభ్యం అవుతుంది. ఎలక్ట్రిక్ మోటారు సాయంతో ఈ కారు నడుస్తుంది.
కంఫర్ట్ మోడ్‌లో వీ6 పెట్రోల్ ఇంజిన్ తోపాటు ఎలక్ట్రిక్ మోటారుతో కలిసి ఎక్కువ మైలేజీ అందిస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో డ్రైవర్ యాక్సిలరేషన్ తక్కువగా ఉన్నా, ఎలక్ట్రిక్ మోటారు కారు స్పీడ్‌కు అవసరమైన పవర్ అందిస్తుంది. ట్రాక్ మోడ్‌లో హైబ్రీడ్ పవర్ సాయంతో త్వరగా వేగం అందుకోవచ్చు.