Maruti Ertiga2023 | అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. మార్కెట్లోకి `ఎర్టిగా 2023` తీసుకొచ్చింది. ఫిలిఫ్పీన్స్ ఇంటర్నేషనల్ మోటార్ షోలో మారుతి.. `ఎర్టిగా-2023`ను ఆవిష్కరించింది. ఇది ఏడు సీటర్ల స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ). దీని ధర రూ.8.41 లక్షలుగా నిర్ణయించింది. ఆరు రంగుల్లో, 14 డిఫరెంట్ వేరియంట్లలో లభ్యం కానున్నది ఎర్టిగా -2023. మాన్యువల్, ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టం కలిగి ఉంటుంది. ఇంతకుముందు ఎర్టిగాతో పోలిస్తే ఎర్టిగా-2023లో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నిడివి పెరిగింది.
17.78 సీఎం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్మార్ట్ ఫ్లే ప్రో డిస్ ప్లేతోపాటు సుజుకి కనెక్టెడ్ టెక్నాలజీ నుంచి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ అనుసంధానించారు. బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఎర్టిగా-2023లో 45 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అమర్చారు. రేర్ వద్ద డిస్క్తోపాటు 360- డిగ్రీల కెమెరా ఉంటుంది. 1462 సీసీ కెపాసిటీ సామర్థ్యంతో కూడిన ఇంజిన్ అమర్చారు. 6-స్పీడ్ ఏటీతో పెడల్ షిఫ్టర్లు కూడా వస్తాయి. రూఫ్ మౌంటెడ్ ఏసీ, ఎయిర్ కూల్డ్ ట్విన్ కప్ హోల్డర్లు, తదితర ఫీచర్లు జత చేశారు.
కస్టమర్ సేఫ్టీకి ప్రాధాన్యమిస్తూ ఫ్రంట్ సీట్లలో నాలుగు ఎయిర్ బ్యాగ్లు ఏర్పాటు చేశారు. కార్ల కొనుగోలుదారులు తమ సౌకర్యం కోసం రెండవ, మూడవ రోలో సీట్లను తగ్గించుకోవచ్చు. ఎర్టిగా -2023కు హార్టెక్ ప్లాట్ ఫామ్, హిల్ హోల్డ్ టెక్నాలజీ, ఈబీడీ సిస్టంతోపాటు ఏబీఎస్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
మారుతి సుజుకి ఎర్టిగా -2023 కారు వీల్స్ రెండు వేర్వేరు రంగుల్లో ఎంచుకోవచ్చు. 3డీ ఒరిగామీ స్టయిల్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రేర్ ల్యాంప్స్ వస్తాయి. కిలో సీఎన్జీపై 26.11 కి.మీ. మైలేజీ వస్తుంది. లీటర్ పెట్రోల్ మీద 20.51 కిలోమీటర్ల మైలేజీ పొందొచ్చు.