Suzuki | సుజుకీ సరికొత్త రికార్డ్.. భారత్లో 3 కోట్ల వాహనాల ఉత్పత్తి
సుజుకీ మోటర్ కార్పొరేషన్ మరో మైలురాయికి చేరుకున్నది. భారత్లో సంస్థ 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. జపాన్ దేశంలో కంటే భారత్లోనే అత్యధిక వేగంగా ఈ వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది.
Suzuki | సుజుకీ ఉత్పత్తి 3 కోట్లున్యూఢిల్లీ, ఏప్రిల్ 3: సుజుకీ మోటర్ కార్పొరేషన్ మరో మైలురాయికి చేరుకున్నది. భారత్లో సంస్థ 3 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. జపాన్ దేశంలో కంటే భారత్లోనే అత్యధిక వేగంగా ఈ వాహనాలను ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పింది. సుజుకీ సబ్సిడరీ సంస్థయైన మారుతి సుజుకీ ఇండియా..మార్చి చివరినాటికి 3 కోట్ల యూనిట్ల మైలురాయికి చేరుకున్నది. జపాన్లో 55 ఏండ్లు 2 నెలల్లో ఈ మైలురాయికి చేరుకోగా, అదే భారత్లో 40 ఏండ్లు 4 నెలల్లోనే ఈ రికార్డు సృష్టించడం విశేషం.
భారత్లో సంస్థ డిసెంబర్ 1983 నుంచి ఉత్పత్తిని ప్రారంభించింది. వీటిలో హార్యానలో ఉన్న ప్లాంట్లో 2.68 కోట్ల వాహనాలు ఉత్పత్తి చేయగా, గుజరాత్ ప్లాంట్లో 32 లక్షలు ఉత్పత్తి చేసింది. ఈ మైలురాయికి చేరుకోవడంలో మారుతి 800 కీలక పాత్ర పోషించింది. 29 లక్షల యూనిట్లు ఈ మాడలే అమ్ముడయ్యాయి. దీంతోపాటు ఆల్టో 800, ఆల్టో కే10, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్,డిజైర్, బాలెనో, బ్రెజ్జా, ఎర్టిగా మాడళ్లు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

