Maruti Suzuki | మారుతి దసరా ఆఫర్లు.. రూ.68 వేల వరకూ డిస్కౌంట్లు..!
Maruti Suzuki | దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మారుతి సుజుకి తన కార్లపై గరిష్టంగా రూ.68 వేల వరకు డిస్కౌంట్ అందిస్తున్నది.
Maruti Suzuki | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా సందర్భంగా అన్ని రకాల కార్లపై డిస్కౌంట్లు ఆఫర్ చేస్తుంది. ఈనెల 15 వరకూ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఇగ్నిస్, బాలెనో, సియాజ్ మోడల్ కార్లపై ‘ప్రీ నవరాత్రి‘ బుకింగ్స్ స్కీం కింద రూ.5000 వరకూ రాయితీ అందిస్తున్నది. దీంతోపాటు ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ బెనిఫిట్లు, క్యాష్ డిస్కౌంట్ల రూపంలో రాయితీలు అందిస్తున్నది.

డిజైర్‌పై రూ.17 వేల వరకూ డిస్కౌంట్
మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ సెడాన్ కారుపై రూ.17 వేల వరకూ డిస్కౌంట్లు లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న బెస్ట్ సెల్లింగ్ సెడాన్ కార్లలో డిజైర్ ఒకటి.

మారుతి బ్రెజాపై రూ.45 వేల రాయితీ
మారుతి కంపాక్ట్ ఎస్యూవీ బ్రెజాపై రూ.45 వేల రాయితీ అందిస్తుంది. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 103 హెచ్‌పీ విద్యుత్, 136.8 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సీఎన్జీ వేరియంట్ పై రూ.20 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ ధర రూ.8.29 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతున్నది.

మారుతి స్విఫ్ట్‌పై ఇలా
మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్ బ్యాక్ కారు స్విఫ్ట్‌పై రూ.47 వరకూ క్యాష్ డిస్కౌంట్ అందిస్తున్నది. సీఎన్జీ వేరియంట్ మీద రూ.33 వేల డిస్కౌంట్ లభిస్తుంది. సీఎన్జీ వేరియంట్ ధర రూ.5.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.

సియాజ్పై రూ.53 వేల రాయితీ
మారుతి సుజుకి సెడాన్ కారు సియాజ్ పై ప్రస్తుత పండుగల సీజన్లో రూ.53 వేల వరకూ డిస్కౌంట్లు అందిస్తున్నది. ఈ కారు ధర రూ.9.30 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

బాలెనోపై రూ.53 వేల వరకూ డిస్కౌంట్
బాలెనో సీఎన్జీ వేరియంట్ పై గరిష్టంగా రూ.55 వేల రాయితీలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ మోడల్ బాలెనో కారుపై రూ.40 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు ధర రూ.6.61 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) ప్రారంభం అవుతుంది.

వ్యాగన్ఆర్ పై రూ.58 వేల వరకూ డిస్కౌంట్
మారుతి వ్యాగన్ఆర్ కారుపై గరిష్టంగా రూ.58 వేల వరకూ రాయితీలు లభిస్తాయి. ఈ కారు ధర రూ.5.54 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.

ఇగ్నిస్‌పై రూ.65 వేల వరకూ డిస్కౌంట్
మారుతి లిటిట్ హ్యాచ్ బ్యాక్ మోడల్ కారు ‘ఇగ్నీస్’పై రూ.65 వేల వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. ఈ కారు ధర రూ.5.84 లక్షల నుంచి మొదలవుతుంది.

ఆల్టో కే10 పై రూ.68వేల రాయితీ
మారుతి సుజుకి చౌక కారు ఆల్టో కే10 సీఎన్జీ వేరియంట్ మీద రూ.68 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ కార్లపై రూ.53 వేల రాయితీ పొందొచ్చు. ఈ కారు ధర రూ.3.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

ఎస్-ప్రెస్సోపై రూ.68 వేల డిస్కౌంట్
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు మీద రూ.68 వేల వరకూ రాయితీ పొందొచ్చు. సీఎన్జీ వేరియంట్ మీద రూ.51 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు ధర రూ.4.26 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

సెలెరియోపై రూ.68 వేల డిస్కౌంట్
మారుతి సుజుకి సెలెరియో సీఎన్జీ వేరియంట్ మీద రూ.68 వేల డిస్కౌంట్ లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ రూ.51 వేల వరకూ రాయితీలు పొందొచ్చు. ఈ కారు ధర రూ.5.36 లక్షల నుంచి మొదలవుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

